Thursday, April 22, 2010

వింత పరుగు...

ఎక్కడికో కూడా తెలియని ఈ అంతే లేని వింత పరుగు,
ఏమి పొందుతున్నానో అని తరచి చూస్తే...అంతా నిశబ్ధం,
ఇంతేనా జీవితం, ఇదేనా జీవితాన్ని జీవించే విధానం,
నులివెచ్హని సూర్యోదయాన్ని అస్వాదించలేకున్నాను,
బుడిబుడి నడకల పసినవ్వుల్ని ఆనందించలేకున్నాను,
నేను నేనేనా అనిపిస్తోంది, నన్నెక్కడో పొగొట్టుకున్నట్లనిపిస్తోంది...

ఎంతో కొత్తగా వింతగా...

నన్ను ప్రేమించే నా నేస్తాన్ని పలుకరించి ఎన్నాళ్ళయ్యింది,
నా బాధల్లొ నా గుండె భారాన్ని మోసే ఈ అక్షరాన్ని తడిమి ఎన్నేళ్ళయ్యింది,
ఇంతలో ఎంతలా మారిపోయింది నా జీవితం,
తిరిగి చూస్తే నాకు నేనే అందనంత దూరంలో... ఎంతో కొత్తగా వింతగా...

నా ప్రియ నేస్తం...

ఆలోచనలన్నీ అక్షరరూపం దాల్చగనే మనస్సు మల్లెపువ్వంత తేలికైన అనుభూతి,
ఎవరో అన్నట్లు నీ సంతోషంలో కాదు నీ బాధలో తోడున్నవాడే నిజమైన నేస్తమని,
అప్పుడు అలొచించలేదు కానీ ఇప్పుడు అలోచిస్తే నిజమేకదా అనిపిస్తోంది,
నా ప్రతి బాధనీ పంచుకున్న నా ప్రియ నేస్తం...ఈ అక్షరమే కదా.....

నీ పరిచయం

ఎన్నో చెప్పాలనే ఆరాటం,
ఏమీ చెప్పలేని మొహమాటం,
కానీ ఒక్కటి మాత్రం నిజం,
ప్రేమని ప్రేమించడం నేర్పింది నీ పరిచయం.